Home › గోదావరి పుష్కరాలు › గోదావరి మాహాత్మ్యము › పేజీ 13 / 29

శ్రీ గోదావరి మాహాత్మ్యము – పేజీ 13

అధ్యాయం 10: కుశావవర్త క్షే త్ర వైభవము

అధ్యాయం 10: కుశావవర్త క్షే త్ర వైభవము

స్కందుడు అడిగెను: "ఓ తండ్రీ ! సింహరాశిలో గురుడు ఉన్నప్పుడు గోదావరి ఎందుకు అంత పవిత్ర మైనదో సవివరంగా చెప్పండి; నేను మిమ్ములను శరణువేడి మనోవాక్కాయకర్మలతో ప్రా ర్థి స్తు న్నాను". శివుడు పలికెను: "పూర్వము దేవాసురులకు ఘోర యుద్ధం జరిగినప్పుడు, రాక్ష సుల చేతిలో ఓడిపోయిన దేవతలు బ్ర హ్మదేవుని శరణుజొచ్చారు. అప్పుడు జగత్కర్త అయిన బ్ర హ్మ— హిమాలయాలలో ఉన్న గంగను సింహరాశిలో గురుడు ప్ర వేశించినప్పుడు ఆరాధించవలసిందిగా దేవతలను ఆదేశించాడు. దేవగురువైన బృహస్పతితో కలిసి ఇంద్రా ది దేవతలు గంగను స్తు తించారు: 'ఓ గంగాభవాని!

నీవు నదులలో శ్రే ష్ఠు రాలవు; రాక్ష సుల వల్ల పదవులు, సంపదలు కోల్పోయి భయంతో నిన్ను శరణువేడిన మమ్ములను రక్షించుము'. త్రి పథగామినియైన గంగ ప్ర త్యక్ష మై —'దేవతలారా! సింహరాశిలో గురుడు ఉన్నంతవరకు మీరందరూ ఈ పర్వత శిఖరంపైనే నివసించండి' అని తెలిపింది. దేవతలు పన్నెండు సంవత్సరాలు గురువుతో కలిసి అక్కడే గడిపారు. పన్నెండేళ్ళు పూర్త యి గురుడు సింహరాశిలోకి రాగానే, ఇంద్రా ది దేవతలందరూ గౌతమీ నదిలో స్నానమాచరించి దివ్య తేజస్సును పొంది రాక్ష సులను సంహరించారు. అందువల్ల సింహస్థ కాలంలో గౌతమీ స్నానం చేసినవారి శత్రు వులు నశించి, వారు అపరాజితులవుతారు.

ఈ కాలంలో పంచవటిలో శ్రీ రాముని దర్శించుకుని, త్ర యంబకేశ్వరుని అర్చించిన మానవుడు ఏడు జన్మల వరకు పుత్ర -ధనహీనుడు కాడు, రోగగ్ర స్తు డు కాడు. త్ర యంబకంలో ఎవరైతే వృషభాన్ని (ఎద్దు ను) దానమిస్తా రో వారికి గోదాన సమాన ఫలం దక్కుతుంది. కుశావవర్త క్షే త్రంలో స్నాన, శ్రా ద్ధా లు ఆచరించినవారికి ఏడు జన్మల దాకా దౌర్భాగ్యం దరిచేరదు. స్కందుడు అడిగెను: 'కుశావవర్త క్షే త్రం ఎలా ఆవిర్భవించింది? దాని మహిమ ఏమిటి?'. శివుడు పలికెను: 'ఓ స్కందా! సర్వతీర్థా ల మహిమలను విడివిడిగా వర్ణించడం నా తరం కాదు, వినడం నీ తరం కాదు; అయినా సంక్షి ప్తంగా చెబుతాను విను.

గౌతమ మహర్షి దర్భలతో (కుశ) నదీ ప్ర వాహాన్ని చుట్టి బంధించిన పవిత్ర స్థా నమే కుశావవర్తం. ఇది బ్ర హ్మహత్యాది పాపాలను పటాపంచలు చేసే పరమ దివ్య క్షే త్రం. వేయి ముఖాలతో వేల కల్పాల పాటు చెప్పినా దీని ప్రా శస్త్యం తరగదు. సకల తీర్థా లలో గోదావరి, సకల దేవుళ్ళలో శివుడు ఉత్త ముడు; అటువంటి నదీ-మహాదేవుల కలయికతో కూడిన కుశావవర్తం అత్యున్నతమైనది. "కుశావవర్త , కుశావవర్త , కుశావవర్త " అని మూడుసార్లు నోటితో పలికిన మూఢుడు సైతం సంసార సాగరాన్ని దాటిపోతాడు. ఈ పుణ్యభూమి యందు దొర్లి స్నానమాచరించిన భక్తు లకు సద్బుద్ధి అలవడుతుంది.

కుశావవర్తం పరమ పవిత్ర మైన జ్ఞా నస్వరూపం; అక్కడ తీర్థ కార్యాలు ఆచరించిన మానవుడు జ్యోతిర్మయ శివస్వరూపాన్ని పొందుతాడు' ".

ఇతి శ్రీ స్కంద పురాణే సింహస్థ గురు మాహాత్మ్యే కుశావవర్త క్షే త్ర వర్ణ నో నామ దశమోఽధ్యాయః సమాప్తః.

← ముందు పేజీవిషయసూచికతరువాత పేజీ →