Home › గోదావరి పుష్కరాలు › గోదావరి మాహాత్మ్యము › పేజీ 12 / 29
శ్రీ గోదావరి మాహాత్మ్యము – పేజీ 12
అధ్యాయం 9: పితృతర్పణ ఫలము & పుణ్యప్ర భావ విచారణ
అధ్యాయం 9: పితృతర్పణ ఫలము & పుణ్యప్ర భావ విచారణ
స్కందుడు అడిగెను: "ఓ తండ్రీ ! గంగాదేవి భూమిపైకి ఎలా అవతరించిందో మీ ముఖతః విన్నాను; అయితే ఆ నది పితృదేవతలను తృప్తి పరిచే విధానాన్ని, ముక్తి ని ప్ర సాదించే తీరును వివరించండి". ఈశ్వరుడు పలికెను: "ఓ స్కందా! గౌతముడు తెచ్చిన ఈ గంగ మహా పుణ్యస్వరూపిణి. కుశావవర్త క్షే త్రంలో ఎవరైతే శ్రా ద్ధ ము, తర్పణము, బ్రా హ్మణ భోజనము లేదా కపిలా గోదానము చేస్తా రో, ఆ పుణ్య ప్ర భావంతో వారు ముక్తి ని పొందుతారు; వారి పితృదేవతలు ప్ర ళయకాలం వరకు పరమ తృప్తి తో ఉంటారు. అక్ష య పుణ్యాన్ని కోరేవారు అక్కడ గోదానము, భూదానము, అన్నదానాలు చేయాలి.
సింహస్థ గురు కాలంలో అక్కడ ఇచ్చే ఇతర దానాల మహిమను వర్ణించడం నా తరమూ కాదు, వినడం నీ తరమూ కాదు! సముద్రం మొదలుకొని భూమిపైనున్న సమస్త తీర్థా లు సింహస్థ సంవత్సరంలో గౌతమిలోకి ప్ర వేశిస్తా యి. గురుడు సింహరాశిలోకి ప్ర వేశించిన తొలిరోజే గౌతమీ నదిలో స్నానమాచరించడం కోటి జన్మల పాపాలను దగ్ధం చేస్తుంది. ఇంద్రా ది దేవతలు, మరుద్గ ణాలు స్వయంగా స్నానార్థం ఇక్కడికి వస్తా రు. భాగీరథీ గంగలో అరవై వేల సంవత్సరాలు నిత్యం స్నానం చేయడం వలన లభించే ఫలము, సింహస్థ సంవత్సరంలో గోదావరిలో ఒక్కసారి స్నానమాచరిస్తే లభిస్తుంది.
కురుక్షే త్రంలో గంగాస్నానం, లేదా సూర్యగ్ర హణ కాలంలో ప్ర భాస క్షే త్ర స్నానం వల్ల ఎంతటి పుణ్యమో, సింహస్థంలో గోదావరి స్నానం అంతటి మహా ఫలాన్నిస్తుంది. ఎలాగోలా ప్ర యత్నించి సింహస్థ కాలంలో గోదావరిలో దిగి స్నానం ఆరంభించినా, ఆ నామస్మరణ మాత్రంచేతనే మానవుడు ధన్యుడవుతాడు. తెలిసిగానీ, తెలియకగానీ చేసిన బ్ర హ్మహత్యాది మహా ఘోర పాతకాలు సైతం సింహస్థ గోదావరి స్నానంతో లయమైపోతాయి. సాధారణ నదీ ప్ర వాహం కంటే సంగమ స్థా నంలో రెట్టింపు ఫలం ఉంటుంది. సింహస్థ సంవత్సరంలో అది నాలుగు రెట్లు , గురుడు అతిచార గతిలో ఉన్నప్పుడు ఆరు రెట్లు , గురుడు వక్రించినప్పుడు ఎనిమిది రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది.
సింహస్థ కాలంలో అగ్ని మొదలైన దేవతలు, సిద్ధు లు, ఋషులు, కిన్నరులు, యక్షు లు, విద్యాధరులు గోదావరి తీరాన నివసిస్తా రు. సమస్త నదులు, సముద్రా లు, చెరువులు, బావులు, గయాది పుణ్యక్షే త్రా లు ఒక సంవత్సరం పాటు ఇక్కడే నివాసముంటాయి. ఈ కాలంలో గంగోత్త ర తీర్థా న్ని ఆశ్ర యించి పితృదేవతలను తృప్తి పరిచిన కుమారులను పితృవులు నిత్యం ఆశీర్వదిస్తూ బ్ర హ్మలోకానికి చేరుకుంటారు. పూర్వము గౌతమి —'మానవుల పాపాలు ఎలా నశిస్తా యి?' అని చింతించగా, గౌతముడు శివుని ఆరాధించమని ఉపదేశించాడు.
అప్పుడు శివుడు ప్ర సన్నుడై—'సింహస్థ గురు సంవత్సరంలో సమస్త తీర్థా లను నీవు పవిత్రం చేస్తా వు; నీ జలాలను సేవించినవారికి సర్వ శుభాలు కలుగుతాయి' అని వరమిచ్చాడు. గురుడు సింహరాశిలో ఉదయించి అస్త మించే లోపు దానశ్ర ద్ధ లేనివారైనా గోదావరి స్నానాన్ని తప్పక ఆచరించాలి. గురు సంక్ర మణానికి ముందు ఒక ఘడియ ఏడు పళాల కాలం అత్యంత పవిత్ర మైన సమయం".
ఇతి శ్రీ స్కంద పురాణే సింహస్థ గురు మాహాత్మ్యే నవమోఽధ్యాయః సమాప్తః.