DISCOVER THE SACRED JOURNEY OF
కాళేశ్వరం యాత్ర & ఆలయ సందర్శన పర్యటనలు
Explore temples, sacred rivers, heritage sites and spiritual destinations around Kaleshwaram with customized tour packages.
కాళేశ్వర నివాసోవా కాళేశ్వర నిరీక్షణం
కాళేశ్వరస్య స్మరణం సర్వపాపప్రణాశనం!!
కాళేశ్వరం, ఇది కేవలం గ్రామం కాదు అది ముక్తి ధామం...
విశ్వం మొత్తం పరమేశ్వరుని గృహమైతే అందులో పూజామందిరమే ఈ కాళేశ్వర క్షేత్రం..
ఆకాశాన్ని స్పృశించాలనుకోవడం. నక్షత్రాలను లెక్కించాలనుకోవడం. సప్త సముద్రాలను ఏకధాటిగా ఈదాలనుకోవడం. లక్ష సింహాల మధ్యన కూర్చొని పంక్తి భోజనం చేయాలనుకోవడం. ఇవేవి సాహసాలు కావు...
ప్రశ్న: మరి ఏది సాహసం...???
కాళేశ్వర క్షేత్రం యొక్క మహత్యాన్ని మాటల్లో వివరించాలనుకోవడం. అక్షరాల్లో బంధించాలనుకోవడం. అవును ఇది నిజం... !!!
ఇక్కడ ప్రతీ చెట్టు పరదేవతయే, ప్రతీ పుట్ట పరాభట్టారికయే. ప్రతీ అణువు అమ్మ స్వరూపమే.. !!!
కాళేశ్వరం, కేవలం గ్రామం కాదు అది ముక్తి ధామం... !!!
ఉపపాతకయుక్తోవా మహాపాపయతోపివా
స్మరణాన్ముక్తినాథస్య ముక్తిగచ్ఛేత్ నసంశయః!!
ముక్తిదోయంముక్తినాథః కిమాశ్చర్యంమునీశ్వరా!
దర్శనాన్ముక్తినాథయస్య భవత్యానందరూపభాక్!!
చందమామ కావాలని ఏడ్చిన బిడ్డడికి అద్దంలో చూపించి అమ్మ అన్నం పెట్టిన మాదిరి, స్వర్గం ఎలా ఉంటుందో చూస్తాననుకునే ఆస్తికులకు పరమాత్ముడు భూమిపై ఉన్న కాళేశ్వర క్షేత్రాన్ని చూపిస్తాడు.. !!!
జీవులు లక్షల జన్మలలో పుణ్యం చేస్తే మనుషులుగా పుడతారు. కోట్ల జన్మలలో పుణ్యం చేస్తే భారత ఖండంలో పుడతారు. అనంతకోటి జన్మలలో పుణ్యం చేస్తే కాళేశ్వర క్షేత్రంలో జన్మిస్తారు. ఇది నిత్యసత్యం.. !!!
నిష్కల్మష భక్త జనులతో, లౌకిక వాంఛల త్యాగధనులతో, పరమశివుణ్ణి సైతం ప్రసన్నం చేసుకోగల సాధనా ఘనులతో నిత్యం శోభిల్లే మహిమాన్విత క్షేత్రం, మన కాళేశ్వర క్షేత్రం.. !!!
అన్నపూర్ణా సదాపూర్ణా సచ్చిదానంద రూపిణీ
ముక్తాకాంతాఃపతేశంభో వర్ధతే ధర్మ దేవతా
తస్యాంస్తుపూజాంయః కుర్యాత్నిత్యానంలభతేన్నరః
వర్ధతేచ పితౄణాంహి ముక్తిహేతుం కరాణ్యపి!!
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఉన్న అయ్యప్రేమ, అష్టాదశ శక్తి పీఠాలలో ఉన్న అమ్మప్రేమల కలబోత కుండపోతగా వర్షించే గొప్ప తపో భూమి గల క్షేత్రం, మన కాళేశ్వర క్షేత్రం.. !!!
ముక్కోటి దేవతల అనుగ్రహ అతివృష్టి.. కలిపురుషుని కల్మష జల్లుల అనావృష్టి క్షేత్రం, మన కాళేశ్వర క్షేత్రం.. !!!
జపమాల పట్టిన సాధకులకు యోగ నిద్రలో జోలపాడుతుంది. కమండలం చేతపట్టిన యోగులకు భానుమండల తేజస్సును అనుగ్రహిస్తుంది మన కాళేశ్వర క్షేత్రం.. !!!
ఇక్కడ భూమిపొరల కంపనాలు ఓంకారాన్ని ప్రతిధ్వనిస్తాయి. భూగర్భజలాలు వేదమాత పాదాలను అభిషేకిస్తాయి.. !!!
Sri Kaleshwara Mukteshwara Swamy Temple is a major pilgrimage destination known for its spiritual significance, Triveni Sangamam and rich cultural heritage.
➤ Get Directions
పనకంటి బ్రాహ్మణ సత్రం
📞 9391254540 • tap for directions
శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర Puja Stores
📞 9849245593 • tap to call
మహతి రెడ్డి మెస్ & రెసిడెన్సీ (లాడ్జి)
📞 9701663365 • 8978598975
Devasthanam 100 Rooms Choultry
📞 9491018012 • tap to call
ఇక్కడ మీ ప్రకటన💬 సత్రం WhatsApp ద్వారా సంప్రదించగలరు: 9391254540 • ఇక్కడ మీ ప్రకటన కోసం rekshetratours@gmail.com కి రాయండి
Choose a package or get a customized plan for your Kaleshwaram Yatra.
Temple Darshan • Triveni Sangamam • Local Sightseeing
Temple Visit • Nearby Temples • Local Sightseeing • Stay Assistance
Explore Kaleshwaram and nearby spiritual destinations
Take our 6-minute PhD research survey — scan the QR code or tap the image.
QR కోడ్ స్కాన్ చేయండి లేదా ఇమేజ్ మీద నొక్కండి.
కాళేశ్వరం చుట్టుపక్కల 50 కి.మీ. పరిధిలోని ఆలయాలు, తీర్థాలు, సంగమాలు మరియు పర్యాటక ప్రదేశాలు. Temples, theerthas, sangamams and tourist places near Kaleshwaram temple.