సంగమ స్నాన మహిమ
భారతదేశంలో ఎన్నో పుణ్యనదులు ప్రవహించి దేశాన్ని ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. ఎన్నో క్షేత్రాలు పుణ్యనదుల పరీవాహక ప్రదేశాలలో వెలసి తమ విశిష్టతను చాటుతున్నాయి. నదీ స్నానం చేసినంత మాత్రాన సర్వులకు మోక్షం కలుగుతుంది.
Many sacred rivers flow through India, and many kshetras stand on their banks. Bathing in a sacred river is said to give moksha to all.
పాప పరిహారం
ఇతర క్షేత్రాలలో చేసిన పాపాలు కాశీలోనూ, కాశీలో చేసిన పాపాలు పంచక్రోశాలలోనూ, పంచక్రోశాలలో చేసిన పాపాలు నదీ సంగమ స్నానం వల్లనూ తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి. ఎంతో పుణ్యప్రదమైన మూడు త్రివేణి సంగమాలు మన కాళేశ్వరం నుండి దాదాపు నలభై కి.మీ. లోపే ఉండటం మన తెలుగు రాష్ట్రాల అదృష్టంగా చెప్పవచ్చు.
మూడు సంగమములు
మొదటి సంగమం – త్రివేణి సంగమం
ప్రాణహిత–గోదావరి సంగమం కాళేశ్వరంలో ఉంది. ప్రణీత, వరద, గౌతమి, వైన్య, సరస్వతి అనే ఐదు నదుల కలయిక; ప్రయాగ కంటే కోటి రెట్లు పుణ్యప్రదమని కాళేశ్వర ఖండం చెబుతుంది. పూర్తి వివరాలు →
రెండవ సంగమం – కుబేర సంగమం (పులస్త్య తీర్థం)
ఇంద్రావతి–గోదావరి సంగమం. కుబేరుడు రావణునికి భయపడి తాత పులస్త్యుని సలహాతో ఆశ్రయం పొందిన ప్రదేశం; నది గర్భంలో సోమేశ్వర లింగం ఉంది. పూర్తి వివరాలు →
మూడవ సంగమం – మాండవి సంగమం
కాళేశ్వరానికి 20 కి.మీ. దూరంలో దామరకుంట, పొక్కూరు వద్ద మానేరు (మాండవి) గోదావరిలో కలిసే చోటు. అన్నపూర్ణా మాత, పుష్కరేశ్వర లింగం సమీపంలో ఉన్నాయి. పూర్తి వివరాలు →
సంగమేశ్వరుడు మరియు గోదావరి స్నానం
సంప్రదాయ పరిక్రమణ క్రమంలో యమకుండ స్నానం, ఆది ముక్తేశ్వర దర్శనం, సంగమ స్నానం, సంగమేశ్వర దర్శనం ఉంటాయి. చూడండి: సంగమేశ్వరుడు – కాళేశ్వరం · గోదావరి స్నానం
యాత్రికులకు సూచనలు
సంగమ ప్రాంతాలలో నీటి ప్రవాహం కాలాన్ని బట్టి మారుతుంది. వర్షాకాలంలో లోతైన ప్రదేశాలకు వెళ్లకండి. పిల్లలు, వృద్ధులతో స్నానం చేసేటప్పుడు తోడుగా ఉండండి, స్థానిక సూచనలు పాటించండి.