అష్ట తీర్థాలు

Ashta Theerthalu – Eight Sacred Theerthalu

పంచక్రోశ గోదావరి పరిక్రమణ – కాళేశ్వరం

← పరిక్రమణ పేజీకి తిరిగి వెళ్ళండి / Back to Parikrama Page

పరిచయం

కాళేశ్వరం పంచక్రోశ గోదావరి పరిక్రమణలో భాగంగా దర్శించే ఎనిమిది పవిత్ర తీర్థాలను అష్ట తీర్థాలు అంటారు. కాళేశ్వర ఖండంలోని శ్లోకం ప్రకారం సప్త కోటీశ్వరం, కుశతర్పణం, బ్రహ్మ, చిత్సుఖ, జ్ఞాన, వాయస, నృసింహ, వ్యాస తీర్థాలు అష్ట తీర్థాలు. గోదావరి తీరంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్ర పరిసరాల్లో ఈ తీర్థాల దర్శనం భక్తులకు ప్రత్యేక పుణ్యప్రదంగా భావిస్తారు.

Ashta Theerthalu are the eight sacred theerthas visited as part of the Kaleshwaram Panchakrosa Godavari Parikrama, near the Sri Kaleshwara Muktheeshwara Swamy temple on the Godavari bank.

శాస్త్రోక్త అష్ట తీర్థాలు – కాళేశ్వర ఖండం

అష్టతీర్థాలు
సప్త కోటీశ్వరం తీర్థం
కుశతర్పణమేవచ ।
బ్రహ్మతీర్థం చిత్సుఖం చ
జ్ఞానతీర్థం చ వాయసమ్ ॥
నృసింహతీర్థం వ్యాసం చ
తీర్థాష్టకముదాహృతమ్ ।

భావం: సప్త కోటీశ్వరము, కుశతర్పణము, బ్రహ్మతీర్థము, చిత్సుఖతీర్థము, జ్ఞానతీర్థము, వాయసతీర్థము, నృసింహతీర్థము మరియు వ్యాసతీర్థము అనే ఈ ఎనిమిదింటిని తీర్థాష్టకం అంటారు. (కాళేశ్వర ఖండం, సప్తమోధ్యాయం, 64, 65 శ్లోకాలు)

ప్రతిపాదిత రివర్‌ఫ్రంట్ ప్రణాళికలోని ఎనిమిది తీర్థాలు / Eight Theerthalu in the Riverfront Plan

ప్రతి తీర్థం పేరుపై నొక్కి దాని వివరాలు చూడండి. మిగిలిన తీర్థాల వివరాలు త్వరలో చేర్చబడతాయి.

తీర్థాల స్థానాలు – మ్యాప్

క్రింది మ్యాప్‌లో అష్ట తీర్థాల స్థానాలు ప్రతిపాదిత రివర్‌ఫ్రంట్ ప్రణాళిక ప్రకారం సంఖ్యలతో గుర్తించబడ్డాయి. మ్యాప్‌లోని సంఖ్యలు ప్రణాళిక క్రమానికి సంబంధించినవి; పైన ఇచ్చిన జాబితా క్రమం దానికి భిన్నంగా ఉండవచ్చు.

Map Route of Sacred Ashta Theerthalu Around Kaleshwaram

పరిక్రమణలో తీర్థ దర్శనం

పంచక్రోశ పరిక్రమణలో క్షేత్రాల దర్శనం తరువాత భక్తులు అష్ట తీర్థాల దర్శనానికి వెళ్తారు. ప్రతి తీర్థం వద్ద జలాన్ని స్పృశించి, సంకల్పం చెప్పుకుని, ప్రార్థన చేయడం సంప్రదాయం. తీర్థాల చుట్టూ నేల తడిగా, జారుడుగా ఉండవచ్చు, కాబట్టి పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి; తీర్థ జలాన్ని శుభ్రంగా ఉంచడానికి సబ్బు, షాంపూ వాడకండి.

ఇవి కూడా చూడండి

సంగమములు · దేవాలయాలు · త్రివేణి సంగమం · దర్శన సమయాలు · ఎలా చేరాలి

← పరిక్రమణ పేజీకి తిరిగి వెళ్ళండి / Back to Parikrama Page
💬