Home › గోదావరి పుష్కరాలు › గోదావరి మాహాత్మ్యము › పేజీ 11 / 29

శ్రీ గోదావరి మాహాత్మ్యము – పేజీ 11

అధ్యాయం 8: శ్రీ రాముడు – కశ్యప మహర్షి సంవాదం

అధ్యాయం 8: శ్రీ రాముడు – కశ్యప మహర్షి సంవాదం

శివుడు పలికెను: "ఓ స్కందా! విన్నంతనే మానవ జన్మను ధన్యం చేసే గౌతముని మరొక దివ్య గాథను చెబుతాను విను. పూర్వం పితృవాక్య పరిపాలనకై శ్రీ రామచంద్రు డు సీతా-లక్ష్మణ సమేతుడై అరణ్యవాసము చేయుచు పంచవటికి చేరుకున్నాడు. అక్కడ రావణాసురుడు సీతాదేవిని అపహరించిన పిమ్మట, రాముడు విరహవేదనతో పంచవటిని వీడి పంపా సరోవర తీరానికి విచ్చేశాడు. అక్కడ పరమ తపోధనుడైన కశ్యప మహర్షి ని దర్శించి, రాజ్యం కోల్పోవడం మొదలుకొని సీతాపహరణం వరకు తన సమస్త దుఃఖాన్ని నివేదించాడు. ఆ వేదనను ఆలకించిన జ్ఞా నవృద్ధు డైన కశ్యప మహర్షి ధ్యానించి ఇలా పలికాడు: 'ఓ రఘురామా!

మహాబాహూ! నేను చెప్పినట్లు చేయుము; సింహరాశిలో గురుడు ఉన్నప్పుడు గౌతమీ జలస్నాన ప్ర భావం అత్యంత దుర్ల భమైన శక్తు లను ప్ర సాదిస్తుంది. విశేషించి కుశావవర్త క్షే త్రంలో స్నానమాచరించుము. నీ భాగ్యవశాత్తు బ్ర హ్మగిరి సమీపంలోనే ఉన్నది, సింహస్థ గురు కాలం కూడా ఆసన్నమైంది; కాబట్టి నీవు అక్కడికి వెళ్ళి పవిత్రు డవు కమ్ము. సింహస్థ సంవత్సరం ముగిసేవరకు నా ఆజ్ఞ తో అక్కడే ఉండుము'. కశ్యపుని ఆదేశానుసారం శ్రీ రాముడు త్ర యంబక క్షే త్రా నికి చేరుకుని తీర్థ విధులన్నీ నెరవేర్చాడు.

సింహస్థ కాలంలో గౌతమీ నదిలో స్నానమాచరించడం వలన శ్రీ రాముడు అజేయమైన దివ్య పరాక్ర మాన్ని సంపాదించి, యుద్ధంలో రావణాసురుని సంహరించి, సీతాదేవిని తిరిగి పొంది, అయోధ్యలో లక్ష్మణునితో కలిసి ధర్మపాలన చేసి, అశ్వమేధాది యజ్ఞా లు నిర్వర్తించి చివరకు వైకుంఠానికి వేంచేశాడు. అందువల్ల సింహస్థ గురు కాలంలో గోదావరి స్నాన-దర్శనాలు సకల పాపాలను, దుఃఖాలను నశింపజేస్తా యి".

ఇతి శ్రీ స్కంద పురాణే సింహస్థ గురు మాహాత్మ్యే రామ-కశ్యప సంవాదో నామ అష్ట మోఽధ్యాయః సమాప్తః.

← ముందు పేజీవిషయసూచికతరువాత పేజీ →