Home › గోదావరి పుష్కరాలు › గోదావరి మాహాత్మ్యము › పేజీ 9 / 29
శ్రీ గోదావరి మాహాత్మ్యము – పేజీ 9
అధ్యాయం 6: సగరోపాఖ్యానము (భాగీరథీ అవతరణ ప్ర స్తా వన)
అధ్యాయం 6: సగరోపాఖ్యానము (భాగీరథీ అవతరణ ప్ర స్తా వన)
స్కందుడు అడిగెను: "ఓ తండ్రీ ! గౌతముడు తెచ్చిన గౌతమి మాహాత్మ్యాన్ని వివరించారు; అయితే క్ష త్రి యుడు (భగీరథుడు) కూడా గంగను తెచ్చాడని చెబుతారు కదా, దానికి కారణమేమిటి? రెండు రకాల గంగలలో ఒక భేదాన్ని తెలిపారు; మరి క్ష త్రి యుడు మీ జటాజూటం నుండి గంగను ఏ విధంగా తీసుకువెళ్ళాడో వివరంగా చెప్పండి". శివుడు పలికెను: "వైవస్వత మన్వంతరంలో ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే చక్ర వర్తి జన్మించాడు; ఆయన పేరు మీదుగానే సముద్రా నికి 'సాగరము' అనే పేరు వచ్చింది. ఆ మహారాజు అశ్వమేధ యాగాన్ని సంకల్పించి, దిగ్విజయ యాత్రా ర్థం యజ్ఞా శ్వాన్ని విడిచిపెట్టి , దానికి రక్ష ణగా తన అరవై వేలమంది సమర్థు లైన కుమారులను వెంట పంపాడు.
అయితే వారు చూస్తుండగానే రాక్ష సులు మాయతో ఆ గుర్రా న్ని అపహరించి రసాతలమైన పాతాళంలో దాచిపెట్టా రు. ఆ మాయావుల ఆచూకీ తెలియక సగర పుత్రు లు భూమండలమంతా గాలించారు, దేవలోకంలోనూ, పర్వతారణ్యాలలోనూ వెతికారు కానీ అశ్వం జాడ దొరకలేదు. యజ్ఞ దీక్ష లో ఉన్న సగరుడు గుర్రం దొరకలేదని తీవ్ర ఆందోళన చెందాడు. ఆ సమయంలో—'ఓ సగర పుత్రు లారా! మీ యజ్ఞా శ్వం పాతాళ లోకంలో కట్ట బడి ఉన్నది' అని ఆకాశవాణి పలికింది. ఆ మాటలు విని వారు రాత్రింబవళ్ళు భూమిని తవ్వుతూ, భూమండలాన్ని చీల్చుకుంటూ పాతాళానికి చేరుకున్నారు.
సగర కుమారులు రావడం చూసి భయపడిన రాక్ష సులు, ఆ గుర్రా న్ని అక్కడ గాఢనిద్ర లో ఉన్న కపిల మహర్షి సమీపంలోకి తీసుకువెళ్ళారు. కపిల మహర్షి పూర్వం దేవతలకు మహోపకారం చేసి, అలసట తీర్చుకోవడానికి ఏకాంతంగా నిద్ర పోయే స్థా నాన్ని కోరగా, దేవతలు పాతాళాన్ని అనుగ్ర హించారు. అంతేకాక—'నన్ను నిద్ర లేపినవారు భస్మమైపోవుదురు గాక' అని మహర్షి కోరగా, దేవతలు 'తథాస్తు ' అని వరమిచ్చారు. రాక్ష సులు కుతంత్రంతో కపిల మహర్షి తల వైపున గుర్రా న్ని కట్టే సి పారిపోయి, దూరం నుండి గమనించసాగారు.
పాతాళానికి చేరిన సగర పుత్రు లు నిద్రి స్తు న్న మునిని, ఆయన ముందున్న గుర్రా న్ని చూసి—'ఇతడే మన యజ్ఞా న్ని భగ్నం చేయడానికి గుర్రా న్ని దొంగిలించినవాడు; ఇతడిని సంహరించి గుర్రా న్ని తీసుకుపోదాం' అని భావించారు. క్ష త్రి య గర్వంతో కఠినమైన దుర్భాషలాడుతూ కపిల మహర్షి ని కాలితో తన్నారు. వెంటనే కపిల మహర్షి కోపంతో కళ్ళు తెరిచి చూడగా, ఆయన నేత్రా ల నుండి వెలువడిన క్రో ధాగ్ని జ్వాలలకు అరవై వేలమంది సగర కుమారులు అక్కడికక్కడే భస్మమైపోయారు. సగరునికి ఈ ఘోరం తెలియక వేచిచూస్తుండగా, నారద మహర్షి వచ్చి రాక్ష సుల మాయ, కపిల మహర్షి ఆగ్ర హం మరియు సగర పుత్రు ల దహన వృత్తాంతాన్ని తెలియజేశాడు.
దుఃఖార్తు డైన సగరునికి అసమంజసుడు అనే మరొక కుమారుడు ఉన్నాడు; కానీ అతడు దుర్గు ణుడై, పసిపిల్ల లను హింసించే స్వభావం కలవాడు కావడంతో ప్ర జల ఫిర్యాదు మేరకు రాజు అతడిని దేశం నుండి బహిష్కరించాడు. అసమంజసుని కుమారుడైన అంశుమంతుడు ఎంతో వినయవంతుడు; సగరుడు అతడిని పాతాళానికి పంపగా, అంశుమంతుడు కపిల మహర్షి ని స్తు తించి ప్ర సన్నం చేసుకుని, యజ్ఞా శ్వాన్ని తీసుకువచ్చి తాతగారి యజ్ఞా న్ని పూర్తి చేయించాడు. అంశుమంతుని కుమారుడు దిలీపుడు; దిలీపుని కుమారుడు భగీరథుడు. యువకుడైన భగీరథుడు తన పూర్వీకులు కపిల మహర్షి శాపం వల్ల భస్మమై నరకంలో పడి ఉన్నారని తెలుసుకుని తీవ్రంగా పరితపించాడు.
వృద్ధు డైన తాత సగరుని వద్ద కు వెళ్ళి—'పితామహా! భస్మమైన మన పూర్వీకులకు ఉత్త మ గతులు ఎలా ప్రా ప్తి స్తా యి?' అని అడిగాడు. సగరుడు —'నాయనా! దానికి మార్గం కపిల మహర్షి కే తెలుసు, ఆయననే ప్రా ర్థించు' అని చెప్పాడు. భగీరథుడు పాతాళానికి వెళ్ళి కపిలునికి నమస్కరించి ఉపాయం కోరగా, మహర్షి ధ్యానంలో శివుని తలచి—'రాజా! పరమశివుని జటాజూటంలో ప్ర వహించే పవిత్ర గంగాజలం నీ పూర్వీకుల భస్మరాశులపై ప్ర వహిస్తే నే వారి శరీరాలు, ఆత్మలు పవిత్ర మై స్వర్గా న్ని పొందుతాయి' అని ఉపదేశించాడు.
భగీరథుడు 'అలాగే చేస్తా ను' అని పలికి, తపస్సుకై మార్గా న్ని తెలుసుకున్నాడు."
ఇతి శ్రీ స్కంద పురాణే సింహస్థ గురు మాహాత్మ్యే భాగీరథీ వర్ణ న ప్ర స్తా వనాయాం సగరోపాఖ్యానో నామ షష్ఠో ఽధ్యాయః సమాప్తః.