Home › గోదావరి పుష్కరాలు › గోదావరి మాహాత్మ్యము › పేజీ 8 / 29
శ్రీ గోదావరి మాహాత్మ్యము – పేజీ 8
అధ్యాయం 5: గౌతమీ నదీ ప్ర శంస & తీర్థ విభాగం
అధ్యాయం 5: గౌతమీ నదీ ప్ర శంస & తీర్థ విభాగం
స్కందుడు అడిగెను: "ఓ మహాదేవా! పూర్వము గౌతమ మహర్షి గంగను జటతో సహా భూమిపైకి తెచ్చిన తర్వాత ఏమి చేశాడు? దానిని నాకు విపులంగా తెలియజేయండి". శివుడు పలికెను: "ఓ స్కందా! మనస్సును సంపూర్ణంగా నియంత్రించిన గౌతముడు పవిత్రు డై గంగను తీసుకువచ్చి, పర్వతాలపై నివసించే దేవతలు, గంధర్వుల చేత స్తు తింపబడుతూ, నా జటాజూటాన్ని శిఖరంపై ఉంచి నన్ను స్తు తించడం ప్రా రంభించాడు. ఆ పిమ్మట చేతులు జోడించి బ్రా హ్మణోత్త ముడైన గౌతముడు గంగాదేవితో ఇలా ప్రా ర్థించాడు: 'ఓ శంకర జటాసంభూతా!
సమస్త ఇష్టా ర్థా లను ప్ర సాదించే జగన్మాతా! మమ్ములను క్ష మించి శాంతస్వరూపిణివై సదా మాకు కల్యాణాన్ని చేకూర్చుము'. ఆ ప్రా ర్థ నకు గంగాభవాని సంతోషించి ఇలా ప్ర శ్నించింది: 'ఓ మునీంద్రా ! దివ్యరూపంతో సుగంధాలు వెదజల్లే నేను స్వర్గ లోకంలో ఉండవలెనా, శివుని కమండలంలో నివసించవలెనా, లేక రసాతలమైన పాతాళానికి వెళ్ళవలెనా? నీవే నిర్ణ యించి చెప్పుము'. దానికి గౌతముడు: 'ఓ దేవీ! ముల్లో కాల హితార్థం, సమస్త మానవాళి కల్యాణార్థం సాక్షా త్తు పరమశివుడే నిన్ను నాకు అనుగ్ర హించాడు; కాబట్టి పరమేశ్వరుని వాక్కు వృథా కాకుండా నీవు లోకహితం గావించుము' అని విన్నవించాడు.
గౌతముని మాటలకు ప్ర సన్నురాలైన గంగాదేవి స్వర్గ ము, మర్త్య ము (భూలోకము), పాతాళము అను మూడు లోకాలలో తన ప్ర వాహ విభాగాలను ఏర్పాటు చేసింది. స్వర్గంలో నాలుగు భాగాలుగా, భూలోకంలో ఏడు ప్ర వాహాలుగా, పాతాళంలో నాలుగు మార్గా లుగా—మొత్తం పదిహేను రూపాలుగా విస్త రించింది. అన్ని చోట్లా సమమైన పుణ్యాన్ని ప్ర సాదిస్తు న్నప్పటికీ, త్ర యంబక క్షే త్ర మందు స్థి రపడిన గౌతమీ గంగ అత్యంత విశేషమైన ఫలాన్ని ప్ర సాదించేదిగా, సమస్త మనోరథాలను నెరవేర్చేదిగా వేదాలు కీర్తి స్తు న్నాయి.
మానవులు అజ్ఞా నం వలన భూమిపైనున్న నదినే చూస్తా రు కానీ, స్వర్గ -పాతాళాలలో విస్త రించిన ఆమె దివ్యత్వాన్ని గ్ర హించలేరు. గౌతమునిచే ఆవిర్భవింపజేయబడిన ఆ గంగ తొలుత సముద్రంలో సంగమించింది. సమస్త దేవతలచే సేవింపబడే ఆ జగన్మాతకు గౌతముడు ఋషులతో కలిసి ప్ర దక్షి ణ చేశాడు. అనంతరం దేవాదిదేవుడైన త్ర యంబకేశ్వర మహాదేవుని పూజించి, నదీ ఉభయ తీరాలలో స్నానమాచరించాలని సంకల్పించాడు. తీర్థ స్నాన సిద్ధి ఎలా కలుగుతుందని ముక్కంటిని ప్రా ర్థించగా, నేను తక్ష ణమే ప్ర త్యక్ష మై గౌతమునితో ఇలా చెప్పాను: 'ఓ గౌతమా!
కేవలం రెండు చేతుల ప్ర మాణము గల ప్ర దేశంలోనైనా సరే నిరంతరం నిజమైన తీర్థ ప్ర భావం నిలిచి ఉంటుంది. హరిద్వారము, ప్ర యాగ, గంగాసాగర సంగమ క్షే త్రా లలో నేను ఎల్ల ప్పుడూ కొలువై ఉంటాను; కాబట్టి ఆ ప్ర దేశాలలోని భాగీరథి మహా పుణ్యప్ర దాయిని. అమరకంటక పర్వతం నుండి ఉద్భవించిన నర్మద, ప్ర యాగలో కలిసే యమున, అంతర్వాహినియైన సరస్వతి, కృష్ణా -భీమా-తుంగభద్ర ల సంగమ స్థా నాలు ముక్తి నిచ్చే పవిత్ర తీర్థా లు. అయినప్పటికీ, సమస్త తీర్థా లకు తీర్థ రూపమైనది ఒక్క గౌతమీ గంగ మాత్ర మే!
భాగీరథీ నదిలో అరవై వేల సంవత్సరాలు స్నానం చేస్తే ఎంత పుణ్యమో, గౌతమీ నదిలో ఒక్కసారి స్నానమాచరించినా అంతే సమాన పుణ్యం లభిస్తుంది. అందునా సింహస్థ గురు వేళ గోదావరి యందు స్నానం చేస్తే నిస్సందేహంగా మోక్షం సిద్ధి స్తుంది. సింహరాశిలో గురుడు ఉన్నప్పుడు ఇతర తీర్థా లను కోరేవారైనా గోదావరికే తరలిరావాలి; ఈ సమయాన గోదావరిని విడిచిపెట్టి అన్య తీర్థా లను సేవించేవారు నరకానికి వెళ్తా రనడంలో సందేహం లేదు. వైష్ణ వి, గోమతి, గంగ, మాహేశ్వరి, బ్ర హ్మనంద, సునంద, కామదాయినీ అనే దివ్య నామాలు కలిగిన ఈ గోదావరి బ్రా హ్మణుని తపోతేజస్సుతో ఆవిర్భవించింది కనుక సర్వశ్రే ష్ఠ మైనది.
పంచమహాభూతాలలో జలం శ్రే ష్ఠ మైనది; జలాలలో తీర్థో దకం, తీర్థో దకాల్లో నదీజలం, నదులలో భాగీరథి ఉత్త మమైనవి కాగా, గంగలలో నీవు తెచ్చిన ఈ గౌతమీ గంగ సర్వోత్త మమైనది. నేను త్ర యంబకేశ్వరుడిగా వెలసిన ఈ కుశావవర్త తీర్థంలో సింహస్థ సంవత్సరంలో సకల తీర్థా లు నివసిస్తా యి. సింహస్థ సంవత్సరంలో ఈ మాహాత్మ్యాన్ని విన్న మానవుడు సర్వ పాపవిముక్తు డవుతాడు' ".
ఇతి శ్రీ స్కంద పురాణే సింహస్థ గురు మాహాత్మ్యే గోదావరీ మహిమా వర్ణ నో నామ పంచమోఽధ్యాయః సమాప్తః.